Parenting Tips | పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. వారి ఉజ్వల భవితను అణుక్షణం ఆలోచిస్తుంటారు. కానీ, వాళ్లు పిల్లల ముందు చేసే కొన్ని పనులే పిల్లల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ మాట ఎవరో అంటుంది కాదు.. చాణుక్యుడు చెప్పిన మాట ఇది. చాణుక్యుడు(Chanakya) చిన్నపెద్దా తేడా లేకుండా అందరికోసం ఎన్నో విలువైన న్యాయసూత్రాలు చెప్పాడు. అందులో భాగంగా జీవితాన్ని ఎలా గడపాలి చెప్పడంతో పాటు.. క్లిష్టపరిస్థితుల్లో కూడా ఎలా ప్రవర్తించాలి అన్నది వివరించారు.
ఆయన పిల్లలను ఎలా పెంచాలి అన్న అంశాన్ని కూడా చెప్పారు. పిల్లల ముందు తల్లిదండ్రులు చేసే ఎలాంటి పనులు.. వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి, ప్రమాదంలో పడేస్తాయి అన్న అంశాలను కూడా ఆయన చెప్పారు. తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే ప్రతిమాట పిల్లలపై ప్రభావం చూపుతుందని అందుకే పిల్లలు దగ్గర్లో ఉన్న సమయంలో ఆచితూచి మాట్లాడాలని చాణుక్యుడు అంటున్నాడు. పిల్లలు చిన్నప్పుడు వారి పరిసరాల్లో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో.. పిల్లలు పెద్దయిన తర్వాత కూడా అదేలా ప్రవర్తిస్తారని ఛాణుక్యుడు అంటున్నారు. అందుకే పిల్లలు చుట్టుపక్కల ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేయకూడని కొన్ని విషయాలను చాణుక్యుడు చెప్పాడు. అవేంటో తెలుసా..
పిల్లల ముందు కించపరిచే పదాలు, దూషనలు చేయకూడదు. చెడు పదాలను తప్పిదాలి కూడా మాట్లాడకూడదు. వారి ముందు చెడు పదాలు, నోరుజారి మాట్లాడటం చేస్తే వారు భవిష్యత్తులో అదే నేర్చుకుంటారు. అవి మరింత సమస్యలకు దారితీస్తుంది. పిల్లలను నాగరికులుగా తమ బాధ్యతను గుర్తించి తదనుగుణంగా నడుచుకోవాలి. పిల్లల ముందు చాలా మర్యాదగా ఉంటే.. వారు కూడా అదే నేర్చుకుంటారని, పెరిగే కొద్దీ వారు కూడా మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకుంటారు.
పిల్లల ముందు ఒట్లు వేయడం, ప్రమాణాలు చేయడం చేయకూడదు. ఏ తల్లిదండ్రీ కూడా తమ పిల్లల ముందు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. ఇది పిల్లల మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు మాట్లాడేటప్పుడు గౌరవంతో మాట్లాడాలి. ఇతరుల గురించి కూడా మంచే మాట్లాడాలి.
పిల్లల ముందు అబద్ధాలు కూడా ఆడకూడదు. వారి ముందే అబద్ధాలు చెప్తే.. అబద్ధాలు చెప్పడం తప్పు కాదన్న భావన వారిలో పెరుగుతుంది. మీ అబద్ధాలలో పిల్లలను కూడా కలిపితే వారిలో మీపై గౌరవం, నమ్మకాన్ని కోల్పోతారని చాణుక్యుడు చెప్తున్నాడు. వీళ్లు మీకు కూడా అబద్ధాలు చెప్పడం ప్రారంభించే అవకాశం ఉందని, అందుకే పిల్లల ముందు అబద్ధాలు చెప్పకపోవడమే మంచిదని చాణుక్యుడు అంటున్నాడు.
Parenting Tips | తల్లితండ్రులు తమ పిల్లల ముందు గొడవ పడడం, ఇతరుల తప్పుల గురించి గట్టిగా మాట్లాడడం వంటివి చేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు అని చాణక్యుడు చెప్పాడు. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం పోతుంది. అందువల్ల, పిల్లలు మిమ్మల్ని అవమానించడానికి, చెడుగా చిత్రీకరించడానికి వెనుకాడరు. అందుకే ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు.