Dreams: ఆ కలలు ఎక్కువ వస్తున్నాయా… అయితే కారణం ఇదే..!

-

Reasons why you constantly Dreams of sex: శృంగారం పెళ్లికాని వాళ్లకు ఓ అద్భుతం.. పెళ్లి అయిన వాళ్లకి వరం(భార్యభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకపోతే!). వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నవారో, లేదా భాగస్వామికి దూరంగా ఉన్నప్పుడో.. సెక్స్‌ గురించి కలలు వస్తుండటం.. వారితో సంభోగంలో మునిగితేలుతున్నట్లు భావప్రాప్తి పొందటం సహజమే.. కానీ తరచుగా శృంగారంపై కలలు వస్తుంటే ఆలోచించాల్సిన విషయమే. ఈ విధంగా కలలు రావటానికి పలు కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఆ కారణాలేంటో తెలుసుకుందాం రండి..

- Advertisement -

శృంగారం అంటే అందరూ ఉవ్వూళ్లూరుతారు. ఇక త్వరలో పెళ్లి కానున్న వారి సంగతి చెప్పనవసరం లేదు.. భాగస్వామిని ఏ విధంగా సంతృప్తి పరచాలి.. ఆ సమయంలో ఎటువంటి భంగిమలు ట్రై చెయ్యాలి అంటూ ధ్యాస అంతా అటే ఉంటుంది. కానీ తరచుగా, ఇతరుల కంటే ఎక్కువగా సెక్స్‌ గురించి కలలు కనటం మిమ్మల్ని ఒకింత అసౌకర్యానికి గురిచేస్తుంటే.. ఇది సహజమైనదనే మీరు అర్థం చేసుకోవాలి. సెక్స్‌ కలలు (Dreams) అనేవి వివిధ కారణాల వల్ల వస్తాయి. మీలో ఉండే అత్యంత ఊహాజనితం, లేదా సృజనాత్మకతలో విహరిస్తున్నారని అర్థం.

ఒకరిపట్ల ఆకర్షితులైతే.. సెక్స్‌ కలలను అనుభవించటానికి సిద్ధంగా ఉండాలని గుర్తించుకోండి. ఒకరు ఆకర్షితులైనప్పుడు వారి శరీరం, మనస్సులో శారీరక, భావోద్వేగ అవసరాలు ఏర్పడుతాయి. దీనివల్ల పలు అంశాలను ఊహించుకుంటుంటారు. మీలో లైంగిక కల్పనలు మీరు ఆకర్షిస్తున్న వారివైపు మిమ్మల్ని తీసుకువెళ్తుంటాయి. కొన్నిసార్లు వచ్చే సెక్స్‌ కలలు మిమ్మల్ని అభద్రతా భావంలోకి నెట్టివేయటం, లేదా ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మీరు ఎక్కువగా ఆరాధించే వారితో లైంగిక చర్యల్లో పాల్గొన్నట్లు కలలు వస్తాయి.

మీరు ఆరాధిస్తున్న వ్యక్తితో అటువంటి కలలు రావటం మిమ్మల్ని అయోమయానికి గురిచేస్తాయి. ఈవిధంగా కలలు రావటానికీ ఓ కారణం ఉంది. ఎప్పుడూ మీ మదిలో వారు ఉండటం, ప్రతి విషయంలో సదరు వ్యక్తి రోల్‌ మోడల్‌గా చూడటం వల్ల, శృంగార కలలో వారి రావటం సహజం. కానీ విపరీతంగా, పదేపదే అటువంటి కలలు వారితో వస్తున్నట్లయితే, వారిని ఆరాధిస్తున్నారా.. లేదా.. ప్రేమిస్తున్నారా అన్నది నివృత్తి చేసుకోవాలి. ఇవి ఏవీ కాకుండా.. తరుచుగా సెక్స్‌ కలలు వస్తున్నాయంటే.. జీవితంలో చాలా కాలం పాటు శృంగారం లేకపోవటం ఓ కారణం కావొచ్చు. లేదా, భాగస్వామికి దూరంగా ఉండటం ఓ కారణం కావొచ్చు. సో సెక్స్‌ డ్రీమ్స్‌ వస్తున్నాయని కంగారుపడిపోకండి. భాగస్వామికి దూరంగా ఉంటే.. వీలైనంత త్వరగా భాగస్వామి వద్ద వాలిపోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...