Relationship: దంపతుల మధ్య హద్దులు కూడా ముఖ్యమే సుమా..!

-

Relationship tips for wife and husband: ఏంటి దంపతుల మధ్య హద్దులు ఉండాలా అని ఆశ్చర్యపోతున్నారా…? అవును భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన సరిహద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత ధృడపరుస్తాయట. ఈ హద్దులను ఎలా పెట్టుకోవాలి.. అసలు హద్దులు ఎంత మేరకు అవసరమో తెలుసుకుందాం రండి.

- Advertisement -

ముద్దుకో హద్దు! ఆలింగనంకు ఒక హద్దు!
మీ భాగస్వామికి మీపై అమితమైన ప్రేమ ఉందని అనుకుందాం. ఎప్పటికప్పుడు తన ప్రేమను ఏదొక చర్య ద్వారా వ్యక్తీకరిస్తున్నారని అనుకుందా. కానీ బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవటం, పది మందిలో కౌగలించుకోవటం భాగస్వామి ప్రేమను వ్యక్తపరుస్తున్నారని అనుకుంటారు.. కానీ మీకు అసౌకర్యంగా ఉండొచ్చు. బహిరంగ ముద్దులు, హగ్గులు అనేవి పాశ్చాత్య దేశాల్లో ఆమోదయోగ్యమే అయినప్పటికీ మన దేశంలో పెద్ద అపరాధంగా చూస్తారు. మనం కూడా ఫారన్‌ దుస్తులు వేసుకుంటున్నాం కదా.. ఫారిన్‌ పోకడలను అనుసరించటంలో తప్పేముంది అనుకోవటం పొరపాటే. మన సంప్రదాయాలు వేరు.. అలవాట్లు వేరు. కాలానుగుణంగా మారినప్పటికీ.. బహిరంగ ముద్దు అని పది మందిలో ఎబ్బెట్టుగా ఉంటుంది. భాగస్వామికి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని భాగస్వామికి అర్థం అయ్యేటట్లు చెప్పేయండి. ఇటువంటివి బహిరంగ ప్రదేశాల్లో చేయవద్దని.. సున్నితంగా చెప్పండి. ఈ హద్దు కేవలం పది మందిలో ఉన్నప్పుడే అని క్షుణ్ణంగా చెప్పేయండి.

ఆ సమయంలో వద్దనిపిస్తోందా.. చెప్పేయండి
లైంగిక సరిహద్దు బంధంలో చాలా ముఖ్యమైనది. ఈ హద్దులో సన్నని గీత భార్యాభర్తల మధ్య ఉంటుంది. ఇది ఏమాత్రం దాటినా.. బంధం (Relationship) విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. భార్యాభర్తలు కలయిక సమయంలో కొన్ని అసంబద్ధ మాటలు, పదాలు భాగస్వామి మనస్సు నొప్పించవచ్చు. లేదా.. అవాంఛిత లైంగిక స్పర్శ అనేది ఇబ్బంది పెట్టవచ్చు. ఎంత భార్యాభర్తలైనప్పటికీ.. వారి భావాలకు స్వేచ్ఛను ఇవ్వటం, ప్రాధాన్యం ఇవ్వటం ముఖ్యమని తెలుసుకోండి. ఒక సమయంలో కలయిక ఇష్టం లేకపోతే.. మెుహమాటం లేకుండా చెప్పేయండి. కానీ సున్నితంగా అర్థం అయ్యే విధంగా చెప్పండి. ఎందుకు వద్దని అంటున్నారో.. ఆ సమయంలో మట్లాడే పదాలు ఎందుకు నచ్చటం లేదో వివరించండి. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం మరింత దగ్గర అవుతుంది. ఒకరి ఇష్టాలు మరొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

కోపంలో తిట్టేస్తున్నారా.. వద్దని చెప్పండి
భావోద్వేగాలు బంధంలో కీలక పాత్ర వహిస్తాయి. ఒక బంధం నిలవాలంటే.. వారి మధ్య ఉన్న భావోద్వేగాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆఫీసు టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో చిన్నపాటి మనస్పర్థలు కామన్‌గా ఉండేవే. కానీ కోపంలో భాగస్వామికి ఎక్కువుగా తిట్టడం, కోపగించుకోవటం చేయటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. దీని నుంచి బయటపడాలంటే.. భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవాలి. కోపంలో అనకూడని మాటలు అంటున్నారని.. కొద్దిగా హెచ్చు స్థాయిలో తిట్లు ఉన్నాయని.. అవి మనసును నొప్పిస్తున్నాయని చెప్పండి. దీనివల్ల భాగస్వామి ఎంత బాధపడుతున్నారన్నది అర్థం అవుతుంది.

కించపరచటం మానుకోండి
పది మందిలో మాట్లాడుకునేటప్పుడు.. ఏదైనా చర్చలో ఉన్నప్పుడు భాగస్వామిని సపోర్ట్‌ చేయకపోయినా ఫర్వాలేదు కానీ.. ఎట్టి పరిస్థితిల్లోనూ కించపరచకండి. ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించండి. ఒకరి భావాలు గాయపడకుండా.. మీ ఒపీనియన్‌ చెప్పేలా చూసుకోండి. మీ భాగస్వామిని మీరే అగౌరవపరిస్తే.. పది మందిలో మీకు కూడా ఎటువంటి గౌరవం లభించదని గుర్తుంచుకోండి. ఎటువంటి ఈగోలకు పోకుండా.. నేను చెప్పిందే నెగ్గాలనే పంతాలపై బంధాలు నడవకూడదు. అందువల్ల ఇద్దరి మధ్య చిన్నపాటి హద్దులు.. గీత దాటని హద్దులు బంధాన్ని బలపరుస్తాయని తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...