Your Partner Really Trust You: మీ పార్టనర్‌ అనుమానిస్తున్నారా?.. తెలుసుకోండి ఇలా

0
Your Partner Really Trust You

Your Partner Really Trust You Recognize These Warning Signs: ఏం చేసినా నీ మంచి కోసమేగా చేస్తున్నా అంటుంటారు.. మీకు వచ్చిన మెసేజ్‌లను చదువుతారు, వచ్చే కాల్స్‌ను అనుమానిస్తారు. వారు నీకెందుకు ఫోన్‌ చేశారని సవాలక్ష ప్రశ్నలతో సతమతం చేసేస్తారు. ఎందుకు ఇలా అనుమానిస్తున్నావ్‌ అని ప్రశ్నిస్తే.. ఇది అనుమానం కాదు.. పొసెసివ్‌నెస్‌ అని పోష్‌గా చెప్తుంటారు. ఏ బంధంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం.. అదొక గాజు గ్లాసు లాంటిది. ఒక్కసారి పగిలిందో.. మళ్లీ మునుపటిలా చేయలేరు. అతికించిన అతుకులు అలానే మిగిలిపోతాయి. అసలు మీ పార్టనర్‌ మిమ్మల్ని నమ్ముతున్నారా.. లేదా అనుమానిస్తున్నారా(Your Partner Really Trust You) అనేది ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం రండి.

ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌కు అస్సలు ఒప్పుకోరు
మా ఫ్రెండ్స్‌ అంతా ఔటింగ్‌ ప్లాన్‌ చేశారు.. నేను కూడా వెళ్దామనుకుంటున్నా ఆని చెప్తే.. మీ పార్టనర్‌ సరే వెళ్లిరా.. నీకు ఒక ఛేంజ్‌లా ఉంటుంది అని అంటే.. మీ పట్ల ఎంతో నమ్మకంతో ఉన్నట్లు. అలా కాకుండా.. ఇప్పుడు వెళ్లటం అవసరమా.. నువ్వంటే నమ్మకమే, కానీ నీ ఫ్రెండ్స్‌ అంటేనే నమ్మకం లేదనే డైలాగ్‌లు చెప్తారు. ఒకవేళ ఏదోరకంగా మీరు ఫ్రెండ్స్‌తో వెళ్లేందుకు ఒప్పుకున్నా, ప్రతి పది నిమిషాలకో మెసేజ్‌, అరగంటకో ఫోన్‌ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్‌తో ప్రశాంతంగా గడపనివ్వరు. ఛ బయటకు వచ్చే బదులు, ఇంట్లోనే కూర్చొని ఉంటే బాగుండేది అని అనిపించేలా చేస్తారు. నమ్మకం లేదని కాదు, నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలనీ.. అయినా నీ గురించి నేను తప్పితే ఇంకెవరు పట్టించుకుంటారు అనే సింపతీ డైలాగులు చెప్తారు. ఇలా మీ బంధంలో జరుగుతుంది అంటే.. మీపై మీ పార్ట్‌నర్‌కు అంతగా నమ్మకం లేదని చెప్పొచ్చు.

ఫోన్‌ చెక్‌ చేస్తారు
మీకు వచ్చే మెసేజుల నుంచి ఈమెయిల్స్‌ వరకు, ఫోన్‌ కాల్స్‌ నుంచి ఏయే యాప్స్‌ వాడారు, ఎక్కడెక్కడ తిరిగారు అని తెలుసుకునేందుకు లొకేషన్‌ డేటాను తరచుగా చెక్‌ చేస్తుంటారు. ప్రతి మెసేజ్‌ అలా ఎందుకు పెట్టారు.. నువ్వు ఎందుకు ఇలా రిప్లై ఇచ్చావు అన్న ధోరణిలో ప్రశ్నిస్తుంటారు. ఇలా చేస్తుంటే.. మీ పార్టనర్‌ మీరు చెప్పేది నమ్మటం లేదని అర్థం. మీ పాస్‌వర్డ్స్‌ అన్నీ తనకు కూడా తెలియాలని, ఒకవేళ మార్చితే ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నిస్తారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎంతసేపు మాట్లాడుతున్నారో చెక్‌ చేస్తారు. అంతసేపు ఏం మాట్లాడుకున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడగటం, దీని గురించేనా అంతసేపు మాట్లాడుకుంది అని అడుగుతారు. ఒకవేళ ఫోన్‌ సంభాషణ మెుత్తం మీరు చెప్పినా.. ఇక నుంచి ఫోన్‌ రికార్డ్‌ చేయమని ఆర్డర్లు పాస్‌ చేస్తుంటారు.

ఎందుకు ఇంతలా అనుమానిస్తున్నారని ఓపిక నశించి ఒక్కమాట అంటే.. దాన్ని చాలా పెద్ద రాద్ధాంతం చేస్తారు. నేను తప్ప ఇంకెవరు నిన్ను అడగాలని ఎదురు ప్రశ్నిస్తుంటారు. వారి పెట్టే మెసేజ్‌లకు, ఫోన్లకు రెస్పాండ్‌ కాకపోతే.. మీరు రెస్పాండ్‌ అయ్యే వరకు ఫోన్‌ను వాయిస్తూనే ఉంటారు. ఈ లక్షణాలన్నీ మీ పార్టనర్‌లో ఉండి ఉంటే.. మీపై అంతగా నమ్మకం లేదనీ.. మీరు చెప్పేవాటిపై గురి కుదరటం లేదని అర్థం. ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని, అసలు ఎందుకు అనుమానిస్తున్నారో అని తెలుసుకోండి. ఏ బంధమైనా నిలబడటానికి నమ్మకమే ప్రధానం అని అర్థం అయ్యేలా వివరించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here