శివరాత్రి రోజు శివుని పూజ ఎలా చేయాలి పూర్తిగా తెలుసుకోండి

శివరాత్రి రోజు శివుని పూజ ఎలా చేయాలి పూర్తిగా తెలుసుకోండి

0
337
Shiva Puja

Shiva Puja: మన హిందువులు ఎంతో ప్రముఖంగా జరుపుకునే పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి, అయితే ఈ శివరాత్రి పండుగని ఎంతో ఘనంగా జరుపుతారు.. ఉత్తర దక్షిణ భారతమే కాదు ఈశాన్య భారతం ఇలా దేశ విదేశాల్లో కూడా శివ భక్తులు స్వామిని కొలుస్తారు… మహా శివరాత్రి ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది… మరి శివరాత్రి రోజు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం..

Shiva Puja: ఈరోజు ఉదయం నిద్రలేవాలి
అలాగే ఉదయం నిద్రలేచి నిత్య కాల కృత్యాలు తీర్చుకోవాలి.
తర్వాత పాలు కాఫీ టీ ఇలాంటివి తాగకుండా తల స్నానం చేయాలి.
తలకి స్నానం ఆచరించి స్వామి శివ నామం జపించాలి
ఇంట్లో దీపారాధన చేసుకోవాలి
ఆ స్వామికి వీలైతే ఇంటిలోనే ఆవుపాలతో అభిషేకం చేసుకోవాలి
వీలైతే అరటిపండు లేదా కొబ్బరికాయ కొట్టి ఇంటిలో వారికి తీర్దంగా ఇవ్వాలి.

అది ప్రసాదంగా స్వామికి సమర్పించి అందరూ తీసుకోవాలి
నూతన వస్త్రాలు ఉంటే అవి కట్టుకోవాలి
తర్వాత దగ్గర్లో ఉన్న శివాలయంలో స్వామిని ఉదయం దర్శించుకోవాలి
ఎనిమిది లేదా 9 లోపు స్వామి దర్శనం చేసుకుంటే మంచిది
ఇక స్వామికి మారేడు దళాలతో నీటితో అభిషేకం చేయించండి
లేదా శంఖం పూలని సంపెగ పూలని నాగమల్లె పుష్పాలని స్వామికి అర్పించండి
చెంబుడు నీటిని లేదా ఆవుపాలని ఉపయోగించి స్వామికి ఉదయం7 లోపు అభిషేకం చేయించండి.
వీలైతే ఆ స్వామి అభిషేక జలం ఇంటికి తీసుకువెళ్లండి… నలువైపులా ఆ జలం చల్లండి,
ఆరోజంగా వీలైతే ఉపవాసం ఉండి స్వామిపైనే మనసు కేంద్రీకరించండి
ఇక ఆరోజు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది .
ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది, కుదిరితే రాత్రి తెల్లవార్లు జాగరం చేయండి.
(ఆరోగ్యం బాగున్నవారు మాత్రమే ఇలా ఉపవాసం ఉండండి)

Read Also: