మాస శివరాత్రి- మహాశివరాత్రికి తేడా ఏమిటి

మాస శివరాత్రి- మహాశివరాత్రికి తేడా ఏమిటి

0
137

శివరాత్రి ఓ పవిత్రమైన రోజుగా చెబుతారు, ఈరోజు శివున్ని అందరూ ఆరాధిస్తారు..మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని అత్యంత పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఈ రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. అయితే, మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి ఆరోజు మహాశివరాత్రిగా చెబుతారు..

అన్నీ లాభాలు రావాలి అన్నా స్వామి కటాక్షం కలగాలి అన్నా శివరాత్రి రోజు పూజలు చేయాలి స్వామిని నిత్యం కొలిచే వారు శివరాత్రి రోజు కూడా కొలుస్తారు, అయితే దేవాలయానికి అప్పుడప్పుడు వెళ్లేవారు శివుడ్ని ఆరోజు దర్శిస్తే కోటి జన్మల ఫలం దక్కుతుంది అంటారు పండితులు.

అందుకే ఈ శివరాత్రి రోజున పాపాలు పోవాలి అన్నా మంచి కార్యాలు చేయాలి అన్నా ఈ రోజు చాలా మంచిది.. ఏదైనా కొత్త కార్యక్రమం చేయాలి అన్నా శివరాత్రి మంచిది అని చెబుతున్నా …భార్య భర్తల మధ్య విభేదాలు తొలగిపోవాలి అంటే స్వామికి అభిషేకం ఇద్దరూ కలిసి చేయించాలి అని చెబుతున్నారు.