శివరాత్రి ఈ ప్రాంతాలలో ఎంతో ఘనంగా జరపుతారు – ఏఏ ప్రాంతాలంటే

శివరాత్రి ఈ ప్రాంతాలలో ఎంతో ఘనంగా జరపుతారు - ఏఏ ప్రాంతాలంటే

0
126

శివరాత్రి రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.. ఉత్తర భారతదేశంలో విష్ణు దేవాలయాల కంటే శివాలయాలే ఎక్కువ.. ఇక కాశీలో కూడా శివుని దేవాలయం ఎంతో ప్రసిద్ది ..వారణాసికి వెళ్లి శివరాత్రి జరుపుకునే వారు లక్షల మంది ఉంటారు.. ఇక నేపాల్ లో, కోట్లాది హిందువుల ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయం దగ్గర ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరు అవుతారు.

నేపాల్ శివ శక్తి పీఠము దగ్గరకు శివరాత్రికి లక్షలాది మంది వస్తారు..బంగ్లాదేశ్లో హిందువులు కూడా మహా శివరాత్రి జరుపుకుంటారు. వారు శివుని దివ్య వరం పొందడానికి ఉపవాశం కూడా ఉంటారు. అనేక బంగ్లాదేశ్ హిందువులు శివరాత్రి రోజున చంద్రనాధ్ ధామ్(చిట్టగాంగ్ వెళ్తారు… శివరాత్రి రోజున ఇలా ఒంటి పద్దు అంటే ఉపవాసం ఉంటే కచ్చితంగా మంచి భర్త – భార్య వస్తారు అని నమ్ముతారు.

మహాకాళేశ్వర్ దేవాలయం, ఉజ్జయినీ లో బాగా జరుపుతారు. జబల్పూర్ నగరంలో తిల్వారా ఘాట్ ప్రాంతంలో కూడా శివరాత్రి బాగా జరుపుతారు.. ఇక దక్షిణ ప్రాంతాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు అన్ని దేవాలయాలు విస్తృతంగా శివరాత్రిని జరుపుకుంటారు. రాత్రి అంతా మెలకువగానే ఉంటారు జాగారంతో.