బతుకమ్మ విశిష్టతలు ప్రతి ఒక్కురు తెలుసుకోవాలి..

బతుకమ్మ విశిష్టతలు ప్రతి ఒక్కురు తెలుసుకోవాలి..

0
111

తెలంగాణ రాష్ట్రంలో అన్నిపండుగల కంటే బతుకమ్మ పండుగను పెద్ద పండుగగాజరుపుకుంటారు… ఈ పండుగను తెలంగాణ ప్రాంత ప్రజలు సుమారు 9 రోజులపాటు జరుపుకుంటారు… ఈ తొమ్మిదిరోజుల్లో మహిళలు ఎంతో నిష్టతో పూజలు చేస్తారు… బతుమ్మకు విగ్రహం లేదు ప్రకృతికి అందగా అలంకరించిన పూలనే మహిళలు తీసుకువచ్చి బతుకమ్మను తయారు చేస్తారు.

బతుకమ్మ విశిష్టత

శ్రీలక్ష్మీని మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా అంటూసాగే బతుకమ్మ పాట ప్రసిద్దమైనది… బతుకమ్మ సర్వదేవతా స్వరూపం లక్ష్మీ పార్వతీ సరస్వతీ దేవీలు బతుకమ్మ స్వరూపంగా భావించి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మపండుగను జరుపుకుంటారు.

దసరా పండుగకు పదిరోజులు ముందు చేసే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు తన భర్త పిల్లా పాపలను సంతోషంగా చూడాలని, పెళ్లికాని మహిళలు మంచి భర్త రావాలని పూజిస్తారు. అలాగే ధనం సంపద, వైభవం, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటారు…