బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రాంతాన్ని గొప్పగా పాలించిన కాకతీయుల నాటించి ఆనవాయితీగా జరుపుకుంటారు… బతుకమ్మ అంటే మళ్లీ జీవించి చల్లగా ఉండమ్మా అని అర్థం… బతుకమ్మ పండుగకు గొప్ప చారిత్రక ఆధారం కనిపిస్తోంది…
కాకతీయ రాజ్యపాలకుడైన గుండన పాలనలో ఫొలం దున్నుతుండగా గుమ్మడితోటలో ఓ స్త్రీదేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో కాకతి అని పిలుస్తారు… గుమ్మడితోటలో లభించినందువల్ల కాకతమ్మ అనే పేరుతో రాజులు ఆమెకు పూజించారట. రాజలతోపాటు ప్రాంత ప్రజలు కూడా పుజించేవారు.
రారు రాను విగ్రహం కన్నా ముందు పూల కుప్పలు పోసి వాటిని పూజించడం మొదలు పెట్టారు పూలకుప్పలే దేవతా స్వరూపంగా మారింది. కాకతమ్మ అనే పేరు రానురాను బతుకమ్మ పేరుగా మారినట్లు చరిత్ర చెబుతోంది… బతుకమ్మ సందేశం ఏంటంటే ఏ జీవి అయినా మట్టిలో నుంచ పుట్టి చివరకు అదేమట్టిలోనే కలిసిపోతుందనే సామాజిక సందేశం బతుకమ్మలో కనిపిస్తోంది.