తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ప్రజలు అంగరంగా వైభవంగా జరుపుకుంటున్నారు… ఈ పండుగ గత నెల 28న మొదలై ఈనెల 6న ముగీయనుంది… ఈ తొమ్మిది రోజులు తెలంగాణ ప్రజలు బతుకమ్మను కన్నులు పండుగగా జరుపుకుంటారు…
ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను ఒక్కచోట పేర్చి బతుకమ్మను అలకంరిస్తారు… ఏ జీవి అయినా మట్టిలో నుంచి పుట్టి చివరకు అదే మట్టిలో కలిసిపోతుందనే సామాజిక సందేశం బతుకమ్మలో కనిపిస్తుంది… మట్టినుంచి పుట్టిన చెట్టు వాటినుంచి వచ్చిన పూలు పూలనుంచి తయారు అయిన బతుకమ్మ నీటిలో కలిసిపోయి మళ్లీ మట్టిగా మారుతుంది… అలాగే జీవులన్ని ఎక్కడి నుంచి పుట్టినా భోగాలు అనుభవించి చివరకు మళ్లీ మట్టిలోనే కలుస్తారనే సందేశాన్ని బతుకమ్మ ఇస్తుంది…