ప్రతి ఏట బతుకమ్మ పండుగను మహిళలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా…

ప్రతి ఏట బతుకమ్మ పండుగను మహిళలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

0
104
Bathukamma

బతుకమ్మ పండుగ…. ఈ పండుగ ఉమ్మడి ఆధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోక ముందు కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంగా అవతరించిందో అప్పటి నుంచి పాలకులు బతుకమ్మ పండుగను జాతీయ పండుగగా జరుపుకుంటారు.

ఈ పండుగను దసరా పండుగకు రెండు వారాలకు ముందు అంటే సెప్టెంబర్ చివరివారం నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు తెలంగాణ ఆడపడుచులు ఎంతో నిష్టతో జరుపుకుంటారు… రంగురంగు పులు, తంగెడు పూలతో బతుకమ్మను తయారు చేసుకుని వాటిముందు బతుకమ్మ ఆడుతారు…

అసలు బతుకమ్మ పండగ ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం….

పూర్వం ఒక బాళిక భూస్వాముల ఆకృత్యాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటుందట.. దాంతో ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా అని దీవించారట. ఇక అప్పటినుంచి మొదలైన ఈ జాతర ఈనాటికి జరుపుకుంటారు…. మహిళలు ఈ పండుగ సందర్భగా తమకు ఎటువంటి ఆపదరాకూడదని భర్త పిల్లలు చల్లగా ఉండాలని గౌరి దేవిని పూజిస్తారు.. ఇక పెళ్లి కానివారు తమకు మంచి భర్త రావాలని కోరుకుంటారు…