అల్లరి చేయడం నేరమా….

అల్లరి చేయడం నేరమా....

0
441

కదిరి పట్టణంలో మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో పవన్, మహ్మద్ 3,5వ తరగతి చదువుతున్నారు… వీరిద్దరు అల్లరి చేస్తున్నారనే ఉద్దేశంతో తాళ్లతో చేతులు కాళ్లను కట్టేసింది పాఠశాల హెచ్ ఎం…

ప్రస్తుతం చిన్నారులను తాళ్లతో కట్టివేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… దీంతో ఎంఈవో స్వయంగా వెళ్లి పరిశీలించారు… అల్లరి చేస్తున్నారనే ఉద్దేశంతో హెచ్ ఎం శ్రీదేవి తమను తాళ్లతో కట్టివేసిందని విద్యార్థులు తెలిపారు…

పిల్ల నిర్భంధం గురించి హైదారాబాద్ కు చెందిన బాలల హక్కుల సంఘం జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమీషన్ కు ఫిర్యాదు చేసింది… ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా నిరసనలు తెలుపుతున్నాయి… వెంటనే హెచ్ ఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు…