అమ్మాయి అందంగా ఉందని , పైగా తమ కులంలో అమ్మాయిలు తక్కువ ఉండటంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ ఆస్తిపరుడు ముందుకు వచ్చాడు, ఇక అమ్మాయి తల్లి మాత్రం మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటే నా పేరు మీద 10 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని కండిషన్ పెట్టింది, అయితే 10 లక్షలు ఖర్చు అయితే అయింది కాని, ఇంత అందమైన అమ్మాయిని వదులుకోవడం ఎందుకు అని.
అబ్బాయి కుటుంబం డిపాజిట్ చేసింది, అయితే పెళ్లికి కూడా అమ్మాయి తల్లి రూపాయి ఖర్చు చేయలేదు, మొత్తం 1 కోటి రూపాయలు అబ్బాయి కుటుంబం ఖర్చు చేసి వివాహం చేసుకున్నారు, పెళ్లి అయి ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు.. ఈ సమయంలో వారి ఇంటకి ఓ ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు నా భార్యని వివాహం చేసుకున్నావు అని ఫోన్ లో అవతల వ్యక్తి ప్రశ్నించారు.
నేను సాయంత్రం మీ ఇంటికి వస్తున్నా అని పోలీసులతో వచ్చాడు, అయితే అప్పటికే ఆమెకి వివాహం అయిందట.. ఆ ఊరు వదిలి ఈ తల్లి కూతుర్లు వచ్చేసి సీక్రెట్ గా ఇక్కడ మరో వరుడ్ని బురిడీ కొట్టించారు ఇలా అబ్బాయిలని తల్లి బురడి కొట్టించి కూతురునిచ్చి వివాహం చేయిస్తోంది, తర్వాత ఆ ఇంటిలో కోడలు బంగారం నగదుతో ఉడాయిస్తోందట, ఇలా ముగ్గురుకి మస్కాకొట్టారట దీంతో పెళ్లి కొడుకు లబోదిబో మంటున్నాడు.