కొలువు కొట్టేందుకు 12 సూత్రాలు – పట్టుపడితే..ప్రభుత్వ ఉద్యోగం మీదే!

0
109

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలుకానుంది. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో 95 శాతం జాబులు ఆ జిల్లాల వారికే దక్కనున్నాయి. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ పడుతుందో అని ఎదురుచూసారు.

ఇప్పటికే ప్రిపరేషన్ అయ్యి ఉద్యోగాలు పడట్లేదని సొంత పని చేసుకునే వారు కొందరైతే, మరికొందరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు మరోసారి పుస్తకాల వేటలో పడ్డారు. ఇక మెదడుకు మేత పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో చాలా మందికి చదివే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియక ఉద్యోగం రాక నానా తంటాలు పడుతుంటారు. కానీ ఈ 12 సూత్రాలను పాటిస్తే కొలువు కొట్టడం అంత కష్టం ఏమి కాదు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొలువు కొట్టేందుకు 12 సూత్రాలు ఇవే:

  1. మొదటగా మనకు మనం ఎంచుకున్న కొలువుకు సంబంధిత సిలబస్‌పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి.

2. అలాగే పరీక్ష విధానాన్ని బట్టి ప్రిపరేషన్‌ కావాలి. ఎందుకంటే ఒక్క మార్కుతోనే జాబ్ కోల్పోయినప్పుడు ఆ బాధ అంతా ఇంతా కాదు. పరీక్ష విధానంలో మైనస్ మార్కులు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

3. పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. అవి మనకు చాలా ఉపయోగపడతాయి.

4. ప్రశ్న, జవాబును బాగా ప్రాక్టీస్‌ చేయాలి. అప్పుడే మనకు ప్రశ్నలు అడిగే విధానం గురించి ఓ అవగాహనకు వస్తాం.

5. ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి.

6. సమయ పాలన పాటించాలి.

7. నిరంతర స్థిరత్వం, ఏకాగ్రతతో కూడిన నిరంతర ప్రిపరేషన్‌ చేయాలి.

8. ప్రణాళిక వేసుకోవడంతో పాటు దానిని తు.చ. తప్పకుండా ఆచరణలో పెట్టాలి.

9. అపోహలు, అపనమ్మకాలు వదంతులు అనవసర సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి.

10. పునఃశ్చరణ చేసుకోవడంతో పాటు అంశాలను సంక్షిప్తంగా నోట్‌ చేసుకొని మననం చేసుకోవాలి.

11. చుట్టూ పోటీ పరీక్షల వాతావరణం సృష్టించుకోవాలి. విజేతలు, నిష్ణాతుల సూచనలు తీసుకోవాలి.

12. ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం, సాధించాలన్న తపన కలిగి ఉండాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది.