16 డిసెంబర్ 2012 న ఏం జరిగింది నిర్భయ ఘటన స్టోరీ

16 డిసెంబర్ 2012 న ఏం జరిగింది నిర్భయ ఘటన స్టోరీ

0
95

చాలా మందికి అసలు నిర్భయ కేసు ఏమిటో తెలియదు.. ఓసారి ఆనాడు జరిగిన కేసు పూర్వాపరాలు చూస్తే..16 డిసెంబర్ 2012 న మన దేశ రాజధాని ఢిల్లీలో ఒక వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. అంతేకాదు ఆమె శరీరంలోని అంతర్గత అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యాయి, అంత కర్కసంగా గంటసేపు ఆమెని బస్సులో తిప్పి ఆరుగురు దుర్మార్గులు అత్యాచారం చేశారు. ఆమె కి 13 రోజులు చికిత్స అందించారు.. కాని ఆమె 29 డిసెంబర్ 2012 న మరణించింది.

16న సాయంత్రం ఆమె తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తూ ఐదుగురు ప్రయాణికులు ఉన్న బస్సు ఎక్కింది. మద్యం తాగి ఉన్న ఆ ఐదుగురు ఆమెను, ఆమె స్నేహితుడిని ఇనుప కడ్డీతో కొట్టి కదులుతున్న బస్సులోనే గంటకు పైగా అత్యాచారం చేసి చివరకు వారిద్దరిని బస్సులోనుంచి బయటకు తోసేశారు. ఒంటిపై బట్టలు కూడా లేవు, దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు పోలీసులు …ఈ సమయంలో పలు చికిత్స లు చేశారు.. చివరగా ఆమెని సింగపూర్ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స అందించినా ఆమె దక్కలేదు.

21 డిసెంబర్ నాటికి బస్సు డ్రైవర్ తో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి వారిని ఉరితీయాలి అని డిమాండ్ చేశారు.రామ్ సింగ్ – బస్సు డ్రైవరు ..అతని తమ్ముడు ముకేష్ సింగ్
వినయ్ శర్మ – జిమ్ ఇన్స్ట్రక్టర్ …అలాగే పవన్ గుప్త – ఒక పండ్ల వ్యాపారి, అంతేకాదు ఈ దుర్మార్గం చేసిన వారిలో మైనర్ బాలుడైన రాజు ఉన్నాడు.. అక్షయ్ ఠాకూర్ బీహార్ నుంచి ఢిల్లీకి పనికి వచ్చిన వ్యక్తి…రాజు మూడేళ్ల తర్వాత మైనర్ కావడంతో అతనిని విడిచిపెట్టారు. ఇలా నలుగురు నిందితులని జైలులో ఉంచి చివరకు రేపు ఉరి తీయనున్నారు.