పబ్జీకి రూ.16 లక్షలు ఖర్చు చేసిన కుర్రాడు చివరకు తండ్రి ఏం చేశాడంటే

పబ్జీకి రూ.16 లక్షలు ఖర్చు చేసిన కుర్రాడు చివరకు తండ్రి ఏం చేశాడంటే

0
108

ఈ చైనా యాప్స్ ఎలా ఆపేశారో అలాగే ఈ పబ్ జీ యాప్ గేమ్ లేకుండా బ్యాన్ చేయాలి అని చాలా మంది కోరుతున్నారు, ఇక పాకిస్తాన్ లో తాజాగా ఈ యాప్ బ్యాన్ చేశారు, దీనికి చాలా మంది అడిక్ట్ అవుతున్నారు, చదువులు పక్కన పెట్టి ఈ గేమ్ తోనే ఉంటున్నారు.

అయితే తాజాగా ఓ 17 ఏళ్ల కుర్రాడు చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. పంజాబ్ కు చెందిన ఈ కుర్రాడు ఆన్ లైన్ క్లాసులు వింటాను అని తన తండ్రి దగ్గర ఫోన్ తీసుకునేవాడు, ఈ సమయంలో పబ్ జీ ఆడేవాడు, అయితే అందులో గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసేందుకు, ఇన్-యాప్ అప్డేట్ కోసం మొబైల్లోని తండ్రి అకౌంట్ను వాడేసేవాడు.

తండ్రి బ్యాంకు ఖాతాలో సుమారు ఇలా 16 లక్షలు వాడేశాడు, ఆ గేమ్ మజాకోసం ఇలా చేశాడట,
తండ్రికి అనుమానం రాకుండా పేమెంట్ మెసేజులను ఫోన్ నుంచి డిలీట్ చేసేవాడు. దీంతో తండ్రికి తన అకౌంట్లో డబ్బులు ఖర్చవుతున్నాయనే సంగతి తెలియలేదు, చివరకు
వైద్య ఖర్చుల కోసం దాచుకున్న మొత్తం రూ.16 లక్షలను పబ్జీ కోసం వాడేశాడు అని తెలిసి తండ్రి షాక్ అయ్యాడు. ఇక కంపెనీ నుంచి ఒక్క రూపాయి వెనక్కి రాదు, దీంతో కొడుకు చేసిన పనికి అతనికి డబ్బు విలువ తెలియాలి అని తనకు తెలిసిన ఓ మెకానిక్ షెడ్ లో పనికి పెట్టాడు.