18 ఏళ్ల క్రితం భార్య చేసిన త‌ప్పుకి భ‌ర్త దారుణ‌మైన శిక్ష‌

18 ఏళ్ల క్రితం భార్య చేసిన త‌ప్పుకి భ‌ర్త దారుణ‌మైన శిక్ష‌

0
86

వివాహం అయి 18 ఏళ్లు అయింది, అయితే అనుకోకుండా ఇద్ద‌రూ క‌లిసి వెళ్లిన ఓ ఫంక్ష‌న్ లో ఆమెకి ఓ స్నేహితుడు క‌నిపించాడు, చివ‌ర‌కు ఆమె అత‌నితో చాలా సేపు మాట్లాడింది, ఇంటికి వెళ్లిన త‌ర్వాత భ‌ర్త ఎవ‌రు అని ఆరాతీశాడు, ఈ స‌మ‌యంలో అత‌ను త‌న‌కు దూరం బంధువు బావ అవుతాడు అని చెప్పింది, అంతేకాదు ముందు అత‌నికి నాకు నిశ్చితార్ధం అయింది అని తెలిపింది.

ఇక న‌న్ను మీ త‌ల్లిదండ్రులు మోసం చేసి పెళ్లి చేశారు అని ఆమె భ‌ర్త నిల‌దీశాడు, ఏకంగా ఆమెని పుట్టింటికి పంపించాడు, మీ కూతురిని నాకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు అని నిల‌దీశాడు, దీనిపై తాను కోర్టుకు వెళ‌తాను అని అన్నాడు. ఇద్ద‌రు పిల్ల‌ల‌ని కూడా వ‌దిలేశాడు ఆమె పుట్టింటిలో.

చివ‌ర‌కు పెద్దలు అంద‌రూ దాదాపు ఆరు నెల‌ల క్రితం అత‌నిని స‌ర్దుమ‌ణిగించి ఇంటికి పంపారు‌, కాపురం చేయ‌మ‌ని కోరారు, శాంతించి ఇంటికి వ‌చ్చాడు, కాని ఆమెతో ముభావంగానే ఉంటున్నాడు, కాని ఈ లాక్ డౌన్ వేళ మ‌రో వివాహం చేసుకుని ఆమెని ఇంటికి తీసుకువ‌చ్చాడు, దీంతో అత‌ని భార్య త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి పోలీస్ స్టేష‌న్ లో కేసు పెట్టింది.