డిఫెన్స్ అండ్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో కింది ఖాళీల భర్తీకి నిర్వహించే సెంటర్ పర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 1901
పోస్టుల విభాగాలు: కెమికల్, ఆటోమొబైల్, సివిల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్టికల్ అండ్ ఎలక్టానిక్స్, ఎలక్టికల్, ఈసీఈ, ఈఐ, మెకానికల్, మెటలర్జీ ఇంజినీరింగ్, అగ్రికలల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎంఎల్‌టీ, ఫొటోగ్రఫీ, ఫిజిక్స్, సైకాలజీ, జువాలజీ తదితరాలు
ఎంపిక విధానం: టైర్-1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహిస్తారు. టైర్-2 సీబీటీని నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
వేతనం: లెవల్ -6 పే కింద రూ. 35,400-1,12400/-
అర్హతలు: సైన్స్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్ / సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత.
వయస్సు: 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‍డ్ వర్గాల వారికి నిబంధన ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.