2022 ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రత్యేకతలు ఇవే..

0
90

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతుంటారు. ఇక ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి పేరుతో కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధిన వివరాలను గణేశ్ ఉత్సవ కమిటీ వివరాలను వెల్లడించింది.

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రత్యేకతలు ఇవే..

శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి విగ్రహం ఎత్తు 50 అడుగులు

ఐదు తలలు, 6 చేతులతో గణేశుడి విగ్రహాన్ని రూపుదిద్దనున్నారు.

అలంకరణ కోసం తలపై ఏడు సర్పాలను ఉంచనున్నారు.

కుడివైపు శ్రీ త్రిశక్తి మహాగాయత్రి , ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రహమణ్యా స్వామి విగ్రహాలు ఏర్పాటుకానున్నాయి.