భారత ప్రభుత్వరంగానికి చెందిన అణుశక్తినగర్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 225
పోస్టుల వివరాలు: మెకానికల్-87, కెమికల్-49, ఎలక్ట్రికల్-31, ఎలక్ట్రానిక్స్-13, ఇన్‌స్ట్రుమెంటేషన్-12, సివిల్-33
అర్హులు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ,బీటెక్,బీఎస్సీ,ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత. గేట్ 2020,2021,2022 స్కోర్ ఉండాలి.
వయస్సు:2022 ఏప్రిల్ 28 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.55,000లతో పాటు వన్‌టైం బుక్ అలవెన్స్ కింద రూ.18,000 చెల్లిస్తారు
ఎంపిక విధానం:గేట్ 2020,2021,2022 మెరిట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసినవారిని పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2022