24 గంటల్లో రెండు పెళ్లిళ్లు చేసుకుంది ఒక యువతి.. ఈ సంఘటన నల్గొండజిల్లా కనగల్ ప్రాంతంలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… శబ్దులాపూరానికి చెందిన మౌనిక అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది… కుటుంబ సభ్యులు ఇటీవలే ఆమెకు సంబంధం కుదిర్చారు…
తాజాగా పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది… అయితే వరుసకు మామయ్య అయ్యే రాజేష్ అనే యుకుడిని మౌనికి కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తుంది… ఈ క్రమంలో రాజేష్ వివాహం అయిన కొన్ని గంటలకు అక్కడకు చేరుకోవడంతో మౌనిక అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది…
దీంతో మౌనికను వివాహం చేసుకున్న వరుడు పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు… అక్కడకు పోలీసులు కూడా వచ్చారు… చర్చల తర్వాత తాము పెళ్లి రద్దు చేసుకుంటున్నామని మగ పెళ్లివారు అక్కడ నుంచి వెళ్లిపోయారు దీంతో మరుసటి రోజు మౌనిక రాజేష్ ను వివాహం చేసుకుంది…
—