25 ఏళ్ల యువతికి- 18 ఏళ్ల యువకుడికి పెళ్లి ప్లాన్ ఇదేనట

25 ఏళ్ల యువతికి- 18 ఏళ్ల యువకుడికి పెళ్లి ప్లాన్ ఇదేనట

0
105

ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ లు చాలా చిన్న వయసులో చేసుకుంటున్నారు, పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా కొన్ని పెద్ద వయసులోనే జరుగుతున్నాయి, తాజాగా మాత్రం అమ్మాయి పెద్దది అబ్బాయి చిన్నవాడు వయసులో ఉన్న వివాహాలు ఎక్కడా జరగడం లేదు…అక్కడక్కడా ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయి, అయితే తాజాగా ఓ వివాహానికి ఇలా ప్రయత్నించారు.

కారు బంగ్లా కోసం 18 ఏళ్ల యువకుడిని 25 ఏళ్ల యువతికి ఇచ్చి వివాహం చేయడానికి ప్రయతించారు. ఈ ఘటన వేలూరు సమీపంలోని అరియూర్లో చోటు చేసుకుంది. 25ఏళ్ల అమ్మాయికి వివాహం అయింది, కాని ఆమె విడాకులు తీసుకుంది, ఈ సమయంలో ఆమెకి 18 ఏళ్ల బందువుల అబ్బాయిని ఇచ్చి వివాహం చేయాలి అని భావించారు..

అమ్మాయి తల్లి తండ్రులు కారు బంగ్లా ఆశచూపి మైనర్ యువకుడితో వివాహం జరపాలని అనుకున్నారు. ఈ సంబంధానికి అమ్మాయి పిన్ని సహకరించింది. యువకుడి తండ్రి ఈనెల 12న వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లును సిద్ధం చేశాడు. కాని అబ్బాయి తల్లికి ఇది నచ్చలేదు,దీంతో పోలీసులకి సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు వచ్చి అబ్బాయికి 21 ఏళ్లు వచ్చాక వివాహం చేయాలి అని , ఇప్పుడు మైనర్ అని చెప్పి వెళ్లారు, దీంతో పెళ్లి ఆగిపోయింది.