3.5 కోట్ల ఇన్సూరెన్స్ కోసం భర్తని చంపేసింది – ఈమె ప్లాన్ తెలిసి షాకైన పోలీసులు

3.5 కోట్ల ఇన్సూరెన్స్ కోసం భర్తని చంపేసింది - ఈమె ప్లాన్ తెలిసి షాకైన పోలీసులు

0
86

కొన్ని కేసులు వింటుంటే నిజంగా ఒళ్లు జలదరిస్తోంది, డబ్బుల కోసం ఏకంగా మనిషి ప్రాణాలు సైతం తీస్తున్నారు.. ఇక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం జరిగిన ఈ దారుణం వింటే షాక్ అవ్వాల్సిందే….కట్టుకున్న భార్య భర్తను చంపేయాలని భావించడం చాలా దారుణమైన విషయం.

 

62 సంవత్సరాల భర్తను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం 57 సంవత్సరాల భార్య హతమార్చించి. వీరు తెలివిగా దీనిని ప్రమాదంలా చూపించాలి అని అనుకున్నారు….కాని పోలీసుల విచారణలో నిజాలు బయటకు వచ్చాయి. తమిళనాడు రాష్ట్రంలో రంగరాజ్ కు పవర్ లూమ్ యూనిట్ ఉంది. అతను చాలా అప్పుడు చేశాడు.. అప్పుల వాళ్లు అతని భార్యపై ఒత్తిడి తీసుకువస్తున్నారు..

రంగరాజ్ అనేక మంది నుంచి సుమారు 1.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.

 

రంగరాజ్ భార్య జోతిమణిని అందరూ ఇలా నగదు అడగడంతో ఆమె కూడా ఇబ్బంది పడింది..రంగరాజ్ రూ .3.5 కోట్ల విలువైన మూడు బీమా పాలసీలు ఉన్నాయి భర్తని చంపేస్తే ఇక బీమా డబ్బుతో అప్పులు తీర్చవచ్చు అని మిగిలిన సొమ్ము ఉంచుకోవచ్చని ప్లాన్ వేసింది.

 

అతడి భార్య జోతిమణి, సమీప బంధువు రాజా కలిసి భర్తకి యాక్సిడెంట్ అయితే , అతనిని వ్యాన్లో తుడుపతికి తీసుకువెళ్లారు. రాత్రి 11 గంటలకు భర్త ఉన్న వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు… దీనిని ప్రమాదంగా క్రియేట్ చేద్దాం అని అనుకున్నారు.. కాని పోలీసుల విచారణలో అడ్డంగా దొరికారు.. ఆ రాజు అనే వ్యక్తి బంకులో పెట్రోల్ కొనడం కెమెరాల్లో రికార్డు అయింది.. దీంతో అడ్డంగా దొరికాడు ఇప్పుడు ఇద్దరూ జైల్లో ఉన్నారు.