ఆటోవాలాలకు 3 లీటర్ల డీజిల్ ఫ్రీ – రియల్లీ గ్రేట్ ఎక్కడ ఇచ్చారంటే

3 liters of diesel free for autos

0
124

కరోనా సమయంలో ఆటోవాలాలకుచాలా ఇబ్బంది ఎదురైంది. దాదాపు ఏడాదిగా పూర్తి సంపాదన ఇంటికి తీసుకువెళ్లేక పోతున్నాం అంటున్నారు. మాములుగానే గిరాకీ లేదు అలాంటిది కరోనా సమయంలో బయటకు ఎవరూ రావడం లేదు. అలాగే లాక్ డౌన్ రాత్రి కర్ఫ్యూలతో దాదాపు మూడు నెలలుగా ఆటోవాలాలకు ఎన్నో కష్టాలు వచ్చాయి.

ఇక పెట్రోల్ డిజీల్ ధరలు మరింత పెరగడంతో ఇంటికి వచ్చే సంపాదనలో మరింత కోత పడుతోంది. వారి కష్టాలను అర్ధం చేసుకున్న ఓ పెట్రోల్ పంప్ యజమాని ఆటోవాలాలకు మూడు లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ ఫ్రీగా ఫిల్ చేశారు. మరి ఇంత గొప్ప వ్యక్తి ఎవరు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అంటే నిజంగా గ్రేట్ అది ఎక్కడో చూద్దాం.

కేరళలోని కాసర్గోడ్ జిల్లా ఎన్మకాజె గ్రామపంచాయతీ పరిధిలో ఓ ఫ్యూయల్ స్టేషన్ ఉండగా అబ్దుల్లా మధుమోల్ దానికి యజమాని. ఆయన సోదరుడు సిద్ధిక్ మధుమోల్ మేనేజర్. ఇలా పంపులో ఈ ఆఫర్ పెట్టారు. సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు రెండు రోజులపాటు ఈ ఆఫర్ అమల్లో ఉంది. మొత్తం 313 మంది ఆటోడ్రైవర్లు ఈ ఆఫర్ను వినియోగించుకున్నారు. లక్ష రూపాయల ఫ్యూయెల్ ఉచితంగా అందించారు. ఈ సాయం చూసి ఆటోవాలాలు చాలా ఆనందించారు.