IPRలో 31 ఎంటీఎస్‌ ఖాళీ పోస్టులు..పూర్తి వివరాలివే?

0
89

గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా రిసెర్చ్‌ ‘మల్టీ టాస్కింక్‌ స్టాఫ్‌’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 31

అర్హులు: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు

జీతం: నెలకు రూ.18,000లకు ఎక్కువ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మేథమెటిక్స్‌, న్యూమరికల్‌, కంప్యూటర్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022