భర్తకి ఆఫీస్ పని అని చెప్పి ముంబై వెళ్లింది, అయితే ఆమె ముంబై వెళ్లలేదు గోవా వెళ్లింది.. ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు , వారి దురదృష్టమో అదృష్టమో ఆరోజు తర్వాత నుంచి లాక్ డౌన్ విధించారు, ఇక భర్తకి ఇక్కడే చిక్కుకున్నా అని చెప్పింది, ఇక పిల్లలు కూడా లేకపోవడంతో అతను తల్లిదండ్రులతో ఉంటున్నాడు.
వివాహం అయి రెండేళ్లు అయింది, ఈ సమయంలో ఆఫీసులో వ్యక్తితో అఫైర్ పెట్టుకుని ఆఫీస్ వర్క్ అని ఇలా టూర్లు తిరుగుతోంది, మొత్తానికి బాగా క్యాష్ పార్టీ కావడంతో ఇద్దరూ 40 రోజులుగా అక్కడ హోటల్ లోనే ఉంటున్నారు, చివరకు ఓ పనితో అడ్డంగా బుక్కయ్యారు.
వారు పే చేసిన నగదుకు సంబంధించి ఆ నగదు బిల్ ఆమె మెయిల్ కు వచ్చింది, భర్త ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న సమయంలో ఆమె మెయిల్ చూడటంతో ఆమె కార్డ్ నుంచి బిల్ గోవాలో ఓ రూమ్ కు పే చేసినట్లు వచ్చింది, దీంతో ఆమె ఎక్కడ ఉందో తన స్నేహితుల ద్వారా ట్రాక్ చూశాడు, ఆమె గోవాలో ఉంది అని తెలిసిఫోన్ చేస్తే ముంబై అని చెప్పింది, ఈలోపు ఆమె తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడంతో ఆమె ఇప్పుడు తెగ టెన్షన్ పడుతోంది.