45 ఏళ్లు – సర్పంచ్ అయ్యేందుకు పెళ్లి చేసుకున్నాడు ఇంట్రస్టింగ్ స్టోరీ

45 ఏళ్లు - సర్పంచ్ అయ్యేందుకు పెళ్లి చేసుకున్నాడు ఇంట్రస్టింగ్ స్టోరీ

0
97

కొంతమంది తమ కలని జీవితంలో నెరవేర్చుకోవాలి అని జీవితంలో చాలా వదులుకుంటారు… ఇంకొందరు అయితే

కుటుంబానికి దూరంగా ఉంటారు…మరికొందరు అసలు పెళ్లి కూడా చేసుకోరు… సో సర్పంచ్ అవ్వాలి అనే కోరికతో 45 ఏళ్ల వయసు వచ్చే వరకూ అస్సలు పెళ్లి చేసుకోలేదు హాతి సింగ్..

 

సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో చాలా ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్నాడు.. గతంలో అనేక సార్లు నిలబడినా జనం అతనికి ఓట్లు వేయలేదు. ఈసారి మహిలకు అక్కడ సీటు వచ్చింది… దీంతో అతను వివాహం చేసుకున్నాడు.. యూపీలోని బాల్లియా జిల్లా కరణ్ చాప్రాకు చెందిన వ్యక్తి ఏం చేశాడు అంటే .

 

పెళ్లిచేసుకుని భార్యను ఎన్నికల్లో నిలబెట్టాలి అని చాలా మంది చెప్పారు… దీంతో తన కోరిక తన భార్య ద్వారా అయినా నెరవేర్చుకోవాలి అని ఆమెని మార్చి 26,2021 తన గ్రామంలోని వివాహం చేసుకున్నాడు…ఏప్రిల్ 13లోపు నామినేషన్ వేయాల్సి ఉంది.. అందుకే ఇప్పుడు ముహూర్తాలు లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు, ఇక ఆమె కూడా భర్త కోసం తాను సర్పంచ్ అవుతాను అని చెబుతోంది.