మనీ బ్యాక్ పాలసీ రాకెట్ స్కీమ్ ద్వారా దాదాపు 500 కోట్లు కాజేశాడు… రూపాయి కూడా దొరక్కుండా ఈజీగా తప్పించుకుందాం అని అనుకున్నాడు, చివరకు అరెస్ట్ అయ్యాడు చెన్నైకి చెందిన ప్రభాకరన్ అలియాస్ క్రిస్టి, ఈ కేసులో అతని భార్య సుకన్య కూడా అరెస్ట్ అయింది.
2012 సంవత్సరంలో అరెస్టు అయ్యాడు. ఎనిమిది నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. తర్వాత చెన్నైలో ఉండకుండా హైదరాబాద్ వచ్చేశాడు, ఈ సమయంలో భార్య జైలులో ఉంది కాని ఆమెకి బెయిల్ రాలేదు దీంతో ఆమె 5 ఏళ్లు జైలులో శిక్ష అనుభవించింది.
తర్వాత బయటకు వచ్చిన ఆమెకి భర్త ఆచూకి తెలియలేదు, తర్వాత బంధువుల ద్వారా భర్త గురించి ఆమెకి తెలిసింది, ఆమె హైదరాబాద్ వచ్చింది, నీతో కలిసి ఉంటాను అని చెప్పింది.. కాని అతను మాత్రం నువ్వు నాతో ఉండద్దు అన్నాడు, దీంతో అతనిని దిండుతో గొంతు నులిమి చంపేసింది.భర్త నిద్రలో చనిపోయినట్టు చెప్పింది. అయితే స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇస్తే భర్త కాదన్నాడని చంపాను అని చెప్పింది, దీంతో మళ్లీ ఆమె జైలుకి వెళ్లింది.