7 అంతస్థుల బిల్డింగ్- 45 రోజులు..డీఆర్డీఓ మరో ఘనత

0
85

దేశాన్ని అత్యంత సురక్షితంగా ఉంచేందుకు డీఆర్డీఓ ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు చేస్తోంది. డీఆర్డీఓ సంస్థ మన దేశం కోసం కృషి చేసి ఎన్నో విజయాలను మనకు దక్కేటట్టు చేసింది. 1958లో ప్రారంభం అయిన ఈ సంస్థ దేశ రక్షణ విభాగానికి కీలకంగా వ్యవహరిస్తోంది.

మన దేశానికి కావాల్సిన అత్యాధునిక ఆయుధాల తయారీ విధానంలో ముందడుగు వేసింది. చదువు విషయంలో కూడా బాలికలకు స్కాలర్‌షిప్‌ స్కీం అమలు చేసి పిల్లలకు ఎంతో ఉపయోగపడింది. భారత దేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చడంతో పాటు రక్షణ సాంకేతికత కోసం విదేశాలపై ఆధారపడకుండా మన రక్షణ వ్యవస్థను బలపరచడానికి ఎంతో సహాయపడుతోంది. ఆయుధాల సాంకేతిక కార్యక్రమాలు, క్షిపణులు, తేలికపాటి యుద్ధ విమానాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లు మొదలైన వాటిపై శ్రద్ధ పెట్టి ఎంతో అభివృద్ధి సాధించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో రికార్డు సష్టించింది డీఆర్డీఓ.

రికార్డు స‌మ‌యంలో డీఆర్డీవో కొత్త బిల్డింగ్‌ను నిర్మించింది. బెంగుళూరులోని ఏరోనాటిక‌ల్ డెవ‌ల‌ప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్‌లో కొత్త కాంప్లెక్స్‌ను క‌ట్టింది. ఆ ఏడు అంత‌స్తుల ఎఫ్‌సీఎస్ కాంప్లెక్స్‌ను కేవ‌లం 45 రోజుల్లోనే డీఆర్డీవో నిర్మించ‌డం విశేషం. ఫిఫ్త్ జ‌న‌రేష‌న్ అడ్వాన్స్‌డ్ విమానాల త‌యారీ కోసం ఈ కేంద్రాన్ని రీస‌ర్చ్ సెంట‌ర్‌గా వాడ‌నున్నారు. ఇవాళ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ కాంప్లెక్స్‌ను ఆవిష్క‌రించ‌నున్నారు. AMCA కోసం ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం ఏవియోనిక్స్ అభివృద్ధి కోసం ఉపయోగించబడుతుంది.