78 ఏళ్ల వృద్ధుడు 17 ఏళ్ల అమ్మాయితో పెళ్లి నెలకే విడాకులు కారణం ఏమిటంటే

78 ఏళ్ల వృద్ధుడు 17 ఏళ్ల అమ్మాయితో పెళ్లి నెలకే విడాకులు కారణం ఏమిటంటే

0
111

అతను 78 ఏళ్ల వృద్ధుడు కాటికి కాళ్లుజాపుకున్న వృద్ధుడు… ఓ టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అసలు ఊహించుకోండి సీన్ ఎలా ఉంటుందో, ఆనాటి కన్యాశుల్కం ఎపిసోడ్ గుర్తు వచ్చి ఉంటుంది…ఇండోనేషియాలో ఇదే జరిగింది..ఆ ముసలోడి పేరు అబా సర్నా- నవిత అనే 17 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గత నెలలో చాలా గ్రాండ్ గా పెళ్లి జరిగింది.

ఆ అమ్మాయికి ఓ మోటార్ సైకిల్ కొనిచ్చాడు, 50 వేల రూపాయలు కానుకగా ఇచ్చాడు ఇవన్నీ అమ్మాయికి ఎదురు కట్నంగా ఇచ్చాడు, కాని నెల రోజుల తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చాడు.. ఎందుకు అంటే అతని కుటుంబ సభ్యులకి ఈ పెళ్లి ఇష్టం లేదు, వారికి ఇష్టం లేకుండా చేసుకోవడంతో అతనితో వారు మాట్లాడేవారు కాదు.

పెళ్లికి ముందే నోని గర్భవతి అని, అది దాచిపెట్టి పెళ్లి చేశారని ఆరోపణలు వచ్చాయి, దీంతో చివరకు ఈ పెళ్లి విడాకుల వరకూ వచ్చేసింది, అయితే సోషల్ మీడియాలో అందరూ ఆమెకి మంచి భర్త వస్తాడు అతన్ని వదిలెయ్ అని అంటున్నారు. కాని ఆ అమ్మాయి మంచిదే అని కావాలనే గర్భవతి అని నిందలు వేశారని నోని కుటుంబం అంటోంది.