దేశంలో 80 ప్రత్యేక రైళ్లు – మన తెలుగు రాష్ట్రాల్లో ఆగే రైళ్లు ఇవే

దేశంలో 80 ప్రత్యేక రైళ్లు - మన తెలుగు రాష్ట్రాల్లో ఆగే రైళ్లు ఇవే

0
99

దేశంలో ఇప్పటికే 230 స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది రైల్వేశాఖ… తాజాగా మరో 80 ప్రత్యేక రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఈ నెల 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు భారతీయ రైల్వే రెడీ అవుతోంది. . ఈ నెల 10 నుంచి రిజర్వేషన్ ప్రక్రియ మొదలు కానున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.

అయితే లాంగ్ రూట్ ట్రైన్స్ ని ఎక్కువ నడుపుతున్నారు, ఇక పెద్ద పెద్ద మేజర్ స్టేషన్ లో మాత్రమే ట్రైన్స్ స్టాప్ హాల్డ్ కల్పిస్తున్నారు, అక్కడ నుంచి వారి సొంత ప్రాంతాలకు వెళుతున్నారు ప్రయాణికులు, దేశంలో మళ్లీ రైళ్లు అన్నీ సర్వీసులు నడవాలి అంటే వ్యాక్సిన్ వచ్చే వరకూ కష్టం అంటున్నారు.

ఇక వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటే అక్కడ మరిన్ని కొత్త సర్వీసులు ప్రారంభం అవుతాయి..అదే మార్గంలో ఆ రైలు వెనకే క్లోన్ ట్రైన్స్ను నడుపుతామని తెలిపారు. మరి మన తెలుగు స్టేట్స్ కు వచ్చే ట్రైన్స్ చూద్దాం.

దక్షిణ మధ్య రైల్వే జోన్లోని తెలుగు రాష్ట్రాల్లో కేవలం నాలుగు రైళ్లు మాత్రమే సేవలు అందించనున్నాయి.
సికింద్రాబాద్-దర్బంగా (07007),
దర్బంగా-సికింద్రాబాద్ (07008),
హైదరాబాద్-పర్బానీ(07563),
పర్బానీ-హైదరాబాద్ (07564)