ఆ బీరు బాటిల్ హంతకుడ్ని పట్టించింది – రియల్ స్టోరీ

ఆ బీరు బాటిల్ హంతకుడ్ని పట్టించింది - రియల్ స్టోరీ

0
90

బిహర్ లో ఇద్దరు వ్యక్తులు ఒకే అమ్మాయిని ప్రేమించారు.. ముందు ఆమెని తన స్నేహితుడు ప్రేమిస్తున్నాడు అని తెలిసి జాదవ్ మళ్లీ ఆమెని ప్రేమలోకి దించాడు.. ఇక ఆమె కూడా ఇద్దరు స్నేహితులతో ప్రేమ నడిపింది.. ఇది తట్టుకోలేని వివేక్ జాదవ్ ని ఎలాగైనా చంపాలి అని భావించాడు.

 

అతను మందు ఎక్కువగా తీసుకుంటాడు.. అయితే తన తల్లిదండ్రుల పెళ్లి రోజు ఈ రోజు నీకు పార్టీ ఇస్తా రా అని పిలిచాడు వివేక్.. జాదవ్ కూడా వెళ్లాడు, ఇక ఇద్దరూ కలిసి అక్కడ పొలాల దగ్గర మద్యం తీసుకున్నారు, అయితే అక్కడ వివేక్ రెండు బీరు బాటిల్స్ కొన్నాడు.. వాటిలో విషం కలిపాడు. ఇక చేదుగా ఉన్నా పెద్ద పట్టించుకోలేదు జాదవ్.

 

అది తాగి అతను చనిపోయాడు… అయితే చివరకు పోలీసులు ఉదయం విచారణ చేస్తే అక్కడ బీరు బాటిల్ కనిపించింది. అందులో విషం ఉంది అని తేలింది.. వెంటనే అతని లాస్ట్ కాల్ చూస్తే ఫ్రెండ్ వివేక్ చేశాడు దీంతో అతన్ని తమ స్టైల్లో విచారిస్తే నిజాలు ఒప్పుకున్నాడు.