ఏ దేవుడికి ఏ ప్రసాదం పెట్టాలి తప్పక తెలుసుకోండి

ఏ దేవుడికి ఏ ప్రసాదం పెట్టాలి తప్పక తెలుసుకోండి

0
108

మన భారత దేశంలో ముఖ్యంగా హిందూ దేవుళ్లు ఎందరో ఉన్నారు, అయితే ఎవరి నమ్మకం వారిది.. వారికి ఇష్ట దైవాన్ని ప్రార్ధించుకుంటారు, అయితే ఈ సమయంలో ప్రసాదాలు కూడా పెడతారు, నైవేద్యం సమర్పిస్తారు, అసలు ఏ దేవుడికి ఏ నైవేధ్యం పెట్టాలి అనేది చాలా మందికి తెలియదు.. మరి ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే పుణ్యం .ప్రసాదంగా ఏమి పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం.

వేంకటేశ్వర స్వామికి: వడపప్పు, పానకం
సంతోషిమాతకు: పులుపులేని పిండివంటలు, తీపిపదార్థాలు
సరస్వతీదేవికి: రేగుపండ్లు, వెన్న, పేలాలు, కొబ్బరి, పాయసం, తెల్ల రవ్వ ప్రసాదం
వినాయకుడికి: బెల్లం, ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు
ఆంజనేయుడికి: అప్పాలు, లడ్డూలు, శెనగలు
సూర్యుడికి: ఆవుపాలతో చేసిన పాయసం, మొలకెత్తిన పెసలు
లక్ష్మీదేవికి: క్షీరాన్నం, పండ్లు
సత్యనారాయణస్వామికి: ఎర్ర గోధుమనూక నెయ్యితో చేసిన ప్రాదం
దుర్గాదేవికి: మినపగారెలు, అల్లం ముక్కలు, పులిహార
షిర్డీ సాయిబాబాకి: పాలు, గోధుమ రొట్టెలు, పాలకోవా
శ్రీకృష్ణుడికి: అటుకులతోకూడిన తీపి పదార్థాలు, వెన్న
శివుడికి: కొబ్బరికాయ, అరటిపండ్లు.
నరసింహస్వామి- లడ్డు
రాముడు – పాలతో చేసిన పదార్ధాలు
రాఘవేంద్రస్వామి- అటుకులు పదార్దాలు
సుబ్రహ్మణ్వేశ్వర స్వామి- పాలతో చేసిన తీపిపదార్ధాలు
వీర భద్రస్వామి- శనగలు