రాయలసీమ రత్నాల సీమ. ఇప్పటికీ అక్కడక్కడా విలువైన వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. ఇక రెయినీ సీజన్లో చాలా మంది సీమ ప్రాంతాల్లో ఈ వజ్రాల కోసం వెతుకులాట చేస్తారు. తాజాగా కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి పొలాలు జాతరను తలపిస్తాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు వజ్రాల కోసం వెతుకుతారు.
జిల్లాలోని జొన్నగిరిలో నిన్న ఓ మహిళా కూలీకి ఖరీదైన వజ్రం లభించింది. అయితే ఇక ఆమె అదృష్టం పండింది.
టమాటా నారు నాటుతున్న కూలీ చేతికి చిక్కిన ఈ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె చాలా సంతోషించింది. ఈ వార్త అయితే అక్కడ వినిపిస్తోంది.
జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇక ఈ ప్రాంతాల్లో స్ధానికులు చాలా మంది తొలకరి జల్లు పడిన సమయంలో ఇలా వెతుకులాట చేస్తారు.