ఆ జంటకి వందేళ్లు కరోనా సోకింది – చివరకు ఏమైందంటే

ఆ జంటకి వందేళ్లు కరోనా సోకింది - చివరకు ఏమైందంటే

0
68

దేశవ్యాప్తంగా కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి… రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే రికార్డుస్దాయిలో కేసులు రావడంతో జనం వణికిపోతున్నారు, ఇక చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ అలాగే కర్ఫ్యూ కూడా అమలు అవుతోంది. ఇక చిన్నా పెద్ద అని లేదు చాలా మందిని ఈ మహమ్మారి వణికిస్తోంది.

 

మహారాష్ట్రకి చెందిన ధేను ఉమాజీ చవాన్(105), ఆయన సతిమణి మోతాబాయి చవాన్ (95) ఈ వయసులో వారికి కరోనా సోకింది.. వీరిద్దరూ ఎలా ఈ కరోనా నుంచి బయటపడతారు అని అందరూ అనుకున్నారు, ఇక డాక్టర్లు కూడా వీరు కోలుకుంటారా అని ఆశ్చర్యపోయారు.

 

కానీ వీరు మాత్రం ఎంతో దైర్యంతో కరోనాను జయించారు… వీరిద్దరూ కలిసి కేవలం ఏడూ రోజుల్లోనే కరోనాను జయించారు, ఇక భార్య భర్త ఎంతో సంతోషంగా ఉన్నారు.వెంటిలేటర్ పై నుంచి లేచి నవ్వుతూ ఇంటికి వచ్చేశారు ఈ జంట… వీరిని చూసి చప్పట్లతో గ్రామంలోకి జనం కుటుంబ సభ్యులు వెల్ కం పలికారు.