ఆ పని చేసినందుకు రోజు సిగరెట్లతో భర్తను కాల్చుతున్న భార్య….

ఆ పని చేసినందుకు రోజు సిగరెట్లతో భర్తను కాల్చుతున్న భార్య....

0
101

ఇంట్లో తన భార్య తనను టార్చర్ పెడుతుందని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు… అయితే పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో అతడి తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు… ఈ సంఘటన కోల్ కతాలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మజుందార్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్…

ఇతడు కోల్ కతాలో భార్య తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు… అయితే కరోనా వల్ల లాక్ డౌన్ ప్రారంభం అవ్వడంతో తల్లిదండ్రులను సొంత గ్రామంలో వదిలి పెట్టివచ్చారు… ఇటీవలే లాక్ డౌన్ సడలించడంతో తల్లిదండ్రులను తిరిగి కోల్ కతాకు తీసుకువచ్చారు… దీంతో భార్య అతనిని టార్చర్ పెట్టడం మొదలు పెట్టింది…

తల్లిదండ్రుల వల్ల కరోనా వస్తుందని ఎందుకు తీసుకువచ్చారని హెచ్చరించింది… ఇదే విషయమై ఆమె తన భర్తను చెప్పదెబ్బలు కొట్టడం పిన్నులతో గుచ్చడం సిగరెట్లతో కాల్చడం చేసింది… ఇక భార్య చిత్రహింసలు తట్టుకోలేకపోయిన భర్త పోలీసులను ఆశ్రయించాడు… అయితే పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు…