ఆ పని చేయనందు యువతికి నరకం చూపించిన యువకుడు…

ఆ పని చేయనందు యువతికి నరకం చూపించిన యువకుడు...

0
108

ఒక అమ్మాయి తనను ప్రేమించలేదనే ఉద్దేశంతో వేధింపులకు దిగాడు… అదికూడా హైటెక్ పద్దతిలో వేధింపులకు దిగాడు… ఇక ఈ వేధింపులు తట్టుకోలేక సదరు యువతి కుటుంబ సలహా కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో అతను ఎవరో గుర్తించారు… ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది… 24 ఏళ్ల యువతి కర్ణాటకలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ వైట్ హౌస్ లో ఉంటుంది…

ఇటీవలే గుర్తు తెలియని వ్యక్తి స్కైప్ ద్వారా కాల్ చేశాడు… ఆమె ఫోన్ ఎత్తగానే అశ్లీలంగా మాట్లాడాడు… లాక్ డౌన్ వల్ల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయింది… దీంతో అతని వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో ఆమె కుటుంబ సలహా కేంద్రానికి ఫిర్యాదు చేసింది… నింధితుడిని గుర్తించేందుకు కుటుంబ సలహా కేంద్రం సైబర్ పోలీసులను సంప్రదించారు…

ఈ నేపధ్యంలో తనని కాలేజిలో ఒక వ్యక్తి ప్రేమిస్తున్నట్లు వేధింపులకు గురి చేసేవాడని చెప్పింది ఇక దాన్ని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తే ముంబాయిలో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తించారు… మొదట ఆవ్యక్తి తనకు సంబంధం లేదని చెప్పాడు.. ఆతర్వాత తానే ఆపి చేశానని ఒప్పుకున్నాడు… దీంతో ఆ యువకుడు యువతికి క్షమాపణ చెప్పడంతో ఆమె కేసు వాపస్ తీసుకుంది…