ఆ పెళ్లికి వెళితే జైలుకే – ఎవరిని వదిలిపెట్టరు -ఎక్కడో తెలుసా

ఆ పెళ్లికి వెళితే జైలుకే - ఎవరిని వదిలిపెట్టరు -ఎక్కడో తెలుసా

0
101

పెళ్లి అంటే ఒకటా రెండా ఎన్ని పనులు ఉంటాయి… పురోహితుడు టెంట్ డెకరేషన్లు కార్లు షామియానా పెళ్లి మండపం భోజనాలు కాటరింగ్ బట్టలు ఇలా చాలా ఉంటాయి… అయితే ఇవేమీ లేకుండా పెళ్లి జరగదు… అయితే రాజస్ధాన్ లో ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది.

 

 

రాజస్థాన్లో రాబోయే మే నెలలో బాల్య వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ బాల్య వివాహాలు జరుగుతాయి అనేది తెలిసిందే… అయితే మే 14న అక్షత తృతీయ, ఆ తర్వాత మే 26న వచ్చే పీపల్ పూర్ణిమ సందర్భంగా బాల్య వివాహాలు జరుగుతుంటాయి. వీటిని జరగకుండా ఆపాలి అని ప్రభుత్వం భావిస్తోంది.

 

దీని కోసం కొన్ని రూల్స్ పెట్టారు ..ఇక పెళ్లి చేసే జంటల వయసు వారి పుట్టిన తేది బర్త్ సర్టిఫికెట్ ప్రింట్ వేయాల్సిందే శుభలేఖల్లో….అలాగే ఇలాంటి పెళ్లి జరుగుతోంది అని తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి పోలీసులకి… ఇక ఇలాంటి బాల్య వివాహాలు జరిగే చోట హజరయ్యే బంధువులు వంట వారు షామియానా వారు అందరిపై కూడా కేసులు పెడతారు…దీని వల్ల అక్కడ బాల్య వివాహాలు జరగకుండా ఆపచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది.. ఇప్పటికే గ్రామాల నుంచి పట్టణాల వరకూ ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.