టీటీడీకి షాక్..ఆ భక్తుడికి రూ.50 లక్షలు చెల్లించాలన్న కోర్టు..కారణం ఏంటంటే?

0
97

సాధారణంగా తిరుమల తిరుపతికి వెళ్లిన భక్తులందరూ మొక్కు మేరకు పలు  కానుకలు చెల్లించుకొంటారు. కానీ ఇక్కడ టీటీడీ నిర్వాకం వల్ల సీన్ రివర్స్ అయింది. టీటీడీనే ఓ భక్తుడికి రివర్స్ చెల్లింపులు చెల్లింకుకోవాల్సి వస్తోంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై లుక్కేయండి..

తమిళనాడు సేలంకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడు మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ. 12,250 చెల్లించారు. ఇప్పటి వరకు ఆయనకు దర్శనం లభించలేదు. గత 17 ఏళ్లుగా టీటీడీకి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం స్పందన లేకపోయింది. కరోనా సమయంలో మేల్ చాట్ వస్త్రం సేవకు బదులుగా వీఐపీ టికెట్ ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసింది. అయితే, దానికి హరి భాస్కర్ ఒప్పుకోలేదు.

మేల్ చాట్ వస్త్రం సేవే కావాలని డిమాండ్ చేశాడు. అతని విన్నపాన్ని టీటీడీ పట్టించుకోకపోవడంతో… ఆయన సేలంలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల కోర్టు భాస్కర్ కు సంవత్సరం లోపు మేల్ చాట్ వస్త్రం సేవను కల్పించాలని, లేకపోతే బాధితుడికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.