యువతకు తీపి కబురు..రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

0
107

మీరు రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.  ప్రభుత్వ రంగ సంస్థ అయిన తిరువనంతపురంలో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిని ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అర్హత:

సివిల్ స్పెషలైజేషన్ లో బీటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతే కాకుండా..సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయోపరిమితి డిసెంబర్31, 2021 నాటికి 35 ఏళ్లకు మించకూడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ. రూ.46,250ల నుంచి రూ.1,31,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు https://keralarail.com/వెబ్ సైట్ ను సందర్శించాలి.

ఈ నోటిఫికేషన్ జూలై 4వ తేదీన విడుదల అయింది. పూర్తి చేసిన దరఖాస్తులను నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోగా.. మేనేజింగ్ డైరెక్టర్, కేఆర్‌డీసీఎల్‌, 5వ అంతస్తు, ట్రాన్స్ టవర్స్, తిరువనంతపురం అడ్రస్ కు పంపించాలి. చివరి తేదీగా ఆగస్టు6, 2022 సాయంత్రం 5 గంటలోపు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.

గమనిక..