ఈ భూమి మీద కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి. అయితే ఇవి చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. పరిశోధకులు సంరక్షణ కేంద్రాల్లో వీటి బాగోగులు చూసుకుంటున్నారు.అసలు అమెజాన్ అడవిలో మనకు పరిచయం కాకుండానే ఈ ప్రపంచానికి తెలియకుండానే 80 జంతు జాతులు అంతరించిపోయాయి. ఇప్పుడు ఓ వండర్ జరిగింది.
ఎన్నో ఏళ్ల కిందటే అంతరించిపోయిందనుకున్న ఫెర్నాన్డినా జెయింట్ తాబేలు మళ్లీ కనిపించింది. తాబేలు ప్రేమికులు వావ్ వండర్ అని ఆనందంలో ఉన్నారు.ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో రకరకాల అరుదైన తాబేళ్లు ఉన్నప్పటికీ, ఫెర్నాన్డినా తాబేలు మాత్రం చాలా స్పెషల్.
దీని గురించి చెప్పాలంటే ఇది దాదాపు 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవిస్తుంది.వీటి మెడ చాలా పొడవుగా ఉంటుంది. సాధారణ తాబేలు కంటే రెండు రెట్లు పొడవుగా వీటి మెడ ఉంటుంది.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ? 1906లో ఆఖరిసారి ఈ తాబేలు కనిపించింది. మళ్లీ ఇప్పుడు చూశారు పరిశోధకులు. ఈక్విడార్ గాలాపెగాస్ ద్వీపంలో ఈ తాబేలు కనిపించింది. దీనిని చాలా క్షేమంగా సంరక్షిస్తున్నారు.