ఆ కారణంతోనే స్నేహితుడు పెంచుకున్న గడ్డంమీద మద్యంపోసి నిప్పంటించాడు…

ఆ కారణంతోనే స్నేహితుడు పెంచుకున్న గడ్డంమీద మద్యంపోసి నిప్పంటించాడు...

0
137

ఇద్దరు రాజకీయనాకులు స్నేహితులు… వీరిద్దరి మద్య ఒక గొడవ హత్యాయత్నానికి దారి తీసింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది… మాజీ ఎంపీటీసీ అయిన సకినాల సత్యనారాయణ అలాగే జాల గ్రామానికి చెందిన ఠాకూర్ ప్రమోద్ సింగ్ ఇద్దరు స్నేహితులు.. సత్యనారాయణ ఎంపీటీసీగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో ప్రమోద్ భార్య కూడా ఎంపీటీసిగా బాధ్యతలు చేపట్టింది…

వీరిద్దరి మండలాలు వేరు అయినా గ్రామాలు పక్క పక్కనే ఉండటంతోస్నేహితులు అయ్యారు… ఈ క్రమంలో ఎర్రగోల సత్యనారాయణ అనే వ్యక్తి మద్యం తాగేందుకు సకినాల సత్యనారాయణను పిలిపించాడు… అప్పటికే ప్రమోద్ అక్కడ ఉన్నాడు… మద్యం తాగాలని సకినాల సత్యనారాయణను ప్రమోద్ ఒత్తిడి చేశాడు… అయితే తాను తాగనని చెప్పాడు..

దీంతో ఆగ్రహించిన ప్రమోద్ గతంలో మన ఇద్దరం కలిసి మందు తాగామని ఇప్పుడు ఎందుకు తాగకున్నావని సకినాల సత్యనారాయణ పెంచుకున్న గడ్డంపై మద్యం పోసి నిప్పంటించారు… దీంతో అతని మృతి చెందాడని భావించి అక్కడ నుంచి పారిపోయారు ఆతర్వాత అతని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు..