ఆచారం మూఢ న‌మ్మ‌కంతో ఓగ‌ర్భ‌వ‌తిని ఏం చేశారంటే

ఆచారం మూఢ న‌మ్మ‌కంతో ఓగ‌ర్భ‌వ‌తిని ఏం చేశారంటే

0
102

కొందరు ఇంకా మూఢ న‌మ్మ‌కాలు పాటిస్తున్నారు, దీని వ‌ల్ల వారు ఇష్టం వ‌చ్చిన రీతిన ప్ర‌వ‌ర్తిస్తున్నారు, తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న దీనికి నిద‌ర్శ‌నం ..ఓ నిండు గ‌ర్భిణీ ఆస్ప‌త్రికి వెళ్లింది, ఈ స‌మ‌యంలో ఆమె బిడ్డ క‌డుపులో ఉండ‌గానే మ‌ర‌ణించింది, దీంతో ఆమె భౌతిక ఖాయం ఇంటికి గ్రామానికి తీసుకురావాలి అని అనుకున్నారు.

కాని దారుణంగా అక్క‌డ ఉన్న గ్రామ‌స్తులు ఊరి పె‌ద్ద‌లు దీనికి ఒప్పుకోలేదు.. బిడ్డ క‌డుపులో ఉండ‌గా చ‌నిపోవ‌డంతో ఆమెని గ్రామంలో ఖ‌న‌నం చేస్తే ఊరికి అరిష్టం అని వ‌ద్దు అన్నారు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రాదేయ‌ప‌డినా వారు ఒప్పుకోలేదు.

చివ‌ర‌కు కొంద‌రు చెప్పిన మాట విని ఆమె శ‌వాన్ని అడ‌వుల్లో చెట్టు ద‌గ్గ‌ర వ‌దిలేశారు, దీనిని కొంద‌రు స్ధానిక యువ‌కులు చూసి పోలీసుల‌కు చెప్ప‌గా వెంట‌నే పోలీసులు గ్రామంలో విచార‌ణ చేసి వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకుని అంతిమ సంస్కారం చేశారు, చూశారుగా ఇలాంటి దారుణ‌మైన ఆలోచ‌‌న‌లు మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్ముతున్నారు కొంద‌రు మూర్ఖులు. క‌ర్నూలు జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.