యాసిడ్ ను మద్యంగా భావించి తాగిన మందుబాబు… ఎక్కడో తెలుసా…

యాసిడ్ ను మద్యంగా భావించి తాగిన మందుబాబు... ఎక్కడో తెలుసా...

0
93

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించింది… దీంతో మందు బాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు… మందుదొరకక చాలామంది విలవిలలాడుతున్నారు.. మరికొందరు ఎప్పుడు షాపులు ఓపెన్ చేస్తారా అని ఎదురు చేస్తున్నారు…

మద్యానికి బానిస అయిన ఒక వ్యక్తి యాసిడ్ ను మద్యంగా భావించి దాన్ని తాగి మృతి చెందాడు ఈ సంఘటన భోపాల్ లో జరిగింది.. సురేష్ అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు… ఇటీవలే లాక్ డౌన్ పొడిగించడంతో మద్యం కోసం విలవిలలాడుతున్నారు..

ఇంట్లో బీర్ సిసాలో యాసిడ్ పోసి దాచి ఉంచారు… ఇక ఆ సీసాను చూసిన సురేష్ యాసిడ్ ను మద్యంగా భావించి దాన్ని తాగాడు దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…