ఈ నెల 8న టీవీ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది, అయితే ఈకేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది, కాని పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నారు, మొత్తానికి ఈ కేసులు ఎవరు ఏం చేశారు అనేది తేలింది.
తూర్పుగోదావరికి చెందిన శ్రావణి 2012లో హైదరాబాద్ వచ్చింది. అప్పటినుంచి టీవీ నటిగా ఎదగాలని అవకాశాల కోసం ప్రయత్నించింది. 2015లో శ్రావణికి ఓ స్నేహితురాలి ద్వారా అనంతపురానికి చెందిన సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం వీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఈ సమయంలో సినిమా నిర్మాత అశోక్ రెడ్డి 2017లో ఆమెకి పరిచయం అయ్యాడు
ఆమెకి ప్రేమతో కార్తీక్ అనే సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు, అక్కడ నుంచి ఆమెతో క్లోజ్ గా ఉన్నాడు..
అశోక్ రెడ్డితోనూ ఆమె స్నేహంగా ఉండేది. ఇక 2019 ఆగస్టు నుంచి దేవరాజ్ రెడ్డితో టిక్టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇక ఆమె అతనితో చాలా చనువుగా ఉండేది.
అయితే ఇది సాయికి నచ్చలేదు..ఎంత వద్దు అని చెప్పినా దేవరాజ్ తో ఆమె రిలేషన్ లో ఉంది, ఈ విషయం ఆమె తల్లిదండ్రులకి చెప్పాడు సాయి, వారు కూడా వద్దు అని చెప్పారు, అయితే సాయి అశోక్ రెడ్డి ఆమె తల్లిదండ్రులు కూడా దేవరాజ్ తో ఉండద్దు అని శ్రావణికి చెప్పారు.
దేవరాజ్ ముందు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఆమె గత సంబంధాలు తెలిసి దూరంగా పెట్టాడు.అయితే సాయి అశోక్ రెడ్డి ఆమె తల్లిదండ్రులు వేధించారు, దీంతో ఆమె కృంగిపోయింది.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన దేవరాజ్ రెడ్డి ఆపై దూరంగా జరగడంతో ఆమె మరింత కృంగుబాటుకు లోనైంది. ఇలా ఆత్మహత్య చేసుకుంది.
సాయికృష్ణారెడ్డిని ఏ1,
అశోక్ రెడ్డిని ఏ2,
దేవరాజ్ రెడ్డిని ఏ3గా ఈకేసులో ఉన్నారు.