ఆడబిడ్డ జన్మించిందని ఓ మూర్ఖ తండ్రి ఆస్ప‌త్రిలో ఏం చేశాడంటే

ఆడబిడ్డ జన్మించిందని ఓ మూర్ఖ తండ్రి ఆస్ప‌త్రిలో ఏం చేశాడంటే

0
108

కొందరు దుర్మార్గులు నీచులు ఆడ‌పిల్ల‌లు పుడితే పురిటిలోనే చంపేస్తున్నారు, పుట్టిన త‌ర్వాత వ‌దిలేసే స‌న్నాసులు కొంద‌రు ఉన్నారు, అబ్బాయిలే కావాల‌ని అమ్మాయిలు వ‌ద్దు అనే వారు ఉన్నారు, అందుకే స్కానింగ్ లో కూడా బిడ్డ ఎవ‌రు అనేది చెప్ప‌డం లేదు.

అయితే తాజాగా ఓ దారుణం జ‌రిగింది …త‌న‌కు ఆడ‌బిడ్డ పుట్టింది అని తెలిసి అత‌ను బాధ‌ప‌డిపోయాడు, ఏకంగా దీనికి కార‌ణం అయిన త‌న భార్యను చంపుతానంటూ ఆసుపత్రిలో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన ఆసుపత్రి సిబ్బందిని సైతం గాయపరిచాడు.

అత‌నిపై వెంట‌నే కేసు న‌మోదు చేశారు, దీంతో అరెస్ట్ అయ్యాడు, ఇది పూణేలో జ‌రిగింది, ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు, ఇలాంటివారు ఇంకా స‌మాజంలో ఉన్నారా అని ఆశ్చ‌ర్య‌పోయారు. కొడుకుని క‌నాల్సింది పోయి కుమార్తెని కంటావా అని మ‌ద్యం తాగి నానా ర‌చ్చ చేశాడు.