అద్బుతమైన ప్లాన్ వేసి భర్తను హత్య చేసిన భార్య

అద్బుతమైన ప్లాన్ వేసి భర్తను హత్య చేసిన భార్య

0
86

భర్త ప్రవర్తనతో విసిగి పోయిన భార్య అతనని చంపెయ్యాలని చూసింది… అయితే భర్తను చంపేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచించింది.. దీంతో అద్బుతమైన ప్లాన్ వేసింది… తన భర్తకు గ్రామీణ బ్యాంకులో 20 లక్షల భీమా చేయించింది.. ఆతర్వాత భర్తను చంపేసింది… చివరకు కటకటలపాలు అయింది…. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం హత్యతండాలో జరిగింది…

బాదావత్ వీరన్న భార్య యాకమ్మతో కలిసి పున్నేలు ప్రాంతంలోని ఓ ప్రైవేటుపాఠశాలలో పని చేసుకుంటున్నారు.. లాక్ డౌన్ కారణంగా వీరు మద్యం సీసాలను సేకరించి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.. ఈ క్రమంలో భర్త మద్యానికి బానిస అయ్యాడు… భార్యపై అలాగే కూతురుపై వీరన్న అసభ్యంగా ప్రవర్తించేవాడు.. దీంతో విసిగిపోయిన భార్య అతన్ని చంపెయ్యాలని నిర్ణయించుకుంది… అయితే అతడు చనిపోతే తదుపరి కార్యక్రమం ఏంటని ఆలోచించి… బ్యాంకులో 20 లక్షల భీమా చేయించింది… ఆ తర్వాత వీరన్న సోదరి భూక్వా బుజ్జి భూక్వా బిచ్చాల సహాయంతో హత్య చేసింది…

ప్లాన్ ప్రకారం భర్త మద్యం సీసాల విక్రమానికి వేరే ప్రాంతానికి వెళ్లాడు ఈ విషయాన్ని భార్య, భూక్వా బుజ్జి భూక్వా బిచ్చాలకుసమాచారం అందించింది. దీంతో బిచ్చా వీరన్నను బైక్ పై ఎక్కించుకుని అతడికి ఫుల్ గా తాగించి అందరు కలిసి ఉరి వేశారు… అయితే అప్పటికీ ఇంకా అతను బతికే ఉండటంతో అతని ముఖంపై బండాయితో కొట్టిచంపాడు…

ఆతర్వాత భార్య యాకమ్మ తన భర్తను ఎవరో హత్య చేశారాని నటించడం మొదలు పెట్టింది.. పోలీసులు కేసు నమోదు చుసుకుని దర్యాప్తు చేయగా భార్యనే హత్య చేయించిందని తేలింది… దీంతో యాకమ్మను భూక్వా బుజ్జి భూక్వా బిచ్చాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…