ఇప్పుడు పిల్లలు ఏది కోరితే అది వెంటనే తల్లిదండ్రులు చేయాల్సిందే.. లేకపోతే ఏకంగా చనిపోయే ఆలోచనలు చేస్తున్నారు, చాలా వరకూ ఇలాంటి ఆలోచనలు చేసి ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు, అసలే కరోనా సమయంలో ఎవరికి ఎలాంటి పని లేదు ..ఈ సమయంలో తండ్రిని సెల్ ఫోన్ కొనివ్వమని కుమారుడు అడిగాడు.
అయితే సెల్ఫోన్ కొనివ్వలేదని మనస్థాపం చెంది పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
అతని వయసు 16 ఏళ్లు, పదవ తరగతి చదువుతున్నాడు. తండ్రిని సెల్ఫోన్ కొనివ్వాలని కోరడంతో పదవ తరగతి పరీక్షలు అయిన తరువాత కొనిస్తానని చెప్పడంతో ఊరుకున్నాడు.
కాని పరీక్షలు వాయిదా పడ్డాయి, మళ్లీ సెల్ అడిగాడు, ఇక కరోనా కదా షాపులు తీసినాక కొంటా అన్నాడు, కాని ఈ లోపే కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు, పిల్లలు ఏది కోరితే అది ఇవ్వడం తప్పులేదు, కాని దానికి లిమిట్ ఉంటుంది. ఇలా సెల్ ఫోన్ కోసం చనిపోవడం దారుణం అంటున్నారు గ్రామస్తులు.