ఆ గ్రామంలో అతని కిరాణా దుకాణం మినహ మరేవీ లేదు.. ఈ లాక్ డౌన్ సమయంలో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడ్డారు… అది దాటి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది, దీంతో అక్కడ వ్యక్తి దగ్గర సరుకులు కొనేందుకు అందరూ వచ్చేవారు.. ఇదే అదునుగా కిలోకి 20 లేదా 30 ఎక్స్ ట్రా అమ్మేవాడు, దీంతో గ్రామంలో చదువుకుని సిటీల్లో ఉద్యోగం చేసే పిల్లలు కూడా రావడంతో..
ఇంత రేట్లు అమ్ముతున్నావు అని వారు అందరూ అడిగారు, బయట ఇదే రేట్లకి కొంటున్నా అని చెప్పాడు, దీంతో వెంటనే సేల్స్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తూనికల కొలతల శాఖ అధికారులకి కంప్లైంట్ ఇచ్చారు, దీంతో తర్వాత రోజు అతను అమ్మిన సరుకు ధరలను చూశారు.
బయట మార్కెట్లో కంటే దారుణంగా ఉన్నాయి, వెంటనే అతని షాపుని క్లోజ్ చేయించారు, గ్రామంలో ఇక మరే దుకాణం లేకపోవడంతో తమకు ఇదే దిక్కు అయింది అని అంటున్నారు అక్కడ జనం, మరో ఏర్పాటు చేయిస్తాం అని అధికారులు తెలిపారు.