నెలకు రూ.2,500 పొందే అదిరే స్కీమ్..పూర్తి వివరాలివే..!

0
128

మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభాల బాట పట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో అదిరే స్కీమ్ ను ప్రవేశపెడుతున్నారు అధికారులు.

పూర్తి వివరాలివే..

పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ కూడా ఒకటి. ఈ  స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అనుకున్న దాని కంటే మంచి ఫలితాలు లభిస్తాయి. దీనిలో డబ్బు పెడితే వడ్డీ వస్తుంది.  దీని వడ్డీ రేటు 6.6 శాతం ఉంటుంది. కానీ ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే పది ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి.

కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చెయ్యచ్చు. ఐదు సంవత్సరాలు ఆ తర్వాత దానిని క్లోజ్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా సుమారు రూ.2500 వస్తుంది. ఈ స్కీమ్ లో చేరితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.